Andala tara song lyrics in telugu – తెలుగులో

0
Andala tara song lyrics in telugu
Andala tara song lyrics in telugu
పల్లవి:    అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి                             .. అందాల తార..
  1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
    
    వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
    
    విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
    
    విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్   .. అందాల తార..
  2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
    
    ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
    
    ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
    
    ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      .. అందాల తార..
  3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
    
    బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
    
    ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
    
    బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన            .. అందాల తార

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here