Baby He Loves You Lyrics in Telugu – Arya 2 DSP

Baby He Loves You Lyrics in Telugu: ఆర్య ,2004 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినిమా  ఇండస్ట్రీ లో ఒక సంచలనం గ మిగిలింది.వినూత్నమైన కథ తో వైవిధ్య దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో వచ్చింది ఈ సినిమా.ఇక 2009 లో ఈ సినిమా కి కొనసాగింపుగా వచ్చిన ఆర్య – 2 సినిమా కూడా అందరి అంచనాలను అందుకో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది .ఇందులో కథ నాయకులూ గ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు నవదీప్ నటించగా ,కథ నాయికా గ అందాల నటి కాజల్ అగర్వాల్ నటించింది.బ్రహ్మానందం,షాయాజీ షిండే,ముఖేష్ ఋషి.

శ్రద్ధ దాస్ ముఖ్యమైన పాత్రలు పోషించారు .ఈ సినిమా ని ఆదిత్య బాబు నిర్మించారు.165 నిమిషాల నిడివి గల ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంటూ సాగుతుంది .

బేబీ హి లవ్స్ యు | Baby He Loves You Lyrics in Telugu

మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు
కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు
పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు
జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు
తీరినట్టి భారమంత... ఓ ఇంకా

తెల్లతెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవుపాల నురగంత
చల్లబువ్వలోన నంజుకుంటూ తిన్న ఆవకాయ కారమంత
పెళ్ళి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత

Baby He Loves You Loves You
Loves You So Much
Baby He Loves You Loves You
Loves You So మచ్...

హే అందమైన నీ కాలికింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తొణికే గాలికున్న గతమంత
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత

Baby He Loves You Loves You
Loves You So Much
Baby He Loves You Loves You
Loves You So Much ...

పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంత
కుంబకర్ణుడి నిద్దరంత ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత..

Baby He Loves You Loves You
Loves You So Much
Baby He Loves You Loves You
Loves You So Much...

పచ్చి వేపపుల్ల చేదు అంత రచ్చబండ పైన వాదనంత
అర్ధమైనా కాకపోయినా భక్తి కొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోన జాబిలంత ఏట ఏట వచ్చే జాతరంత
ఏక పాత్రలో నాటకాలలో నాటు గోలలంత

Baby He Loves You Loves You
Loves You So Much
Baby He Loves You Loves You
Loves You So Much...

అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లు పడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
హో బిక్కు బిక్కుమంటూ పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైనా సవాలు చేసే ఆటగాడి పొగరంత

Baby He Loves You Loves You
Loves You So Much
Baby Baby He Loves You Loves You
Loves You Too Much...

ఎంత దగ్గరైనా నీకు నాకు మద్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైనా నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున్నా నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైనా హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత

Baby He Loves You Loves You
Loves You So Much
Baby Baby He Loves You Loves You
I Love You So Much...

ఇక ఈ సినిమా కి సంగీత దర్శకత్వం మన టాలీవుడ్ రెహమాన్ గ పేరు గాంచిన దేవి శ్రీ ప్రసాద్ గారు వ్యవహరించారు .ఈ సినిమా లో ఉన్న అన్ని పాటలు అద్బుధమైన విజయాన్ని సాధించాయి .సంగీత దర్శకుడికి తోడు గాయని  గాయకులూ కూడా మంచి సహకారం అందించడం తో అందరి కృషి ఫలించింది .15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యప్తంగా  40 కోట్లు సాధించి మంచి విజయాన్ని నమోదు చేసింది .

అందరు చాల చక్కగా తమ తమ పాత్రల్లో ఒదిగి పోయారు ,అజయ్ పోషించిన క్యారెక్టర్ సినిమా చివర్లో నవ్విస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది .ఇక ఈ సినిమా లో వన్ సైడ్ లవ్ గురించి మల్లి చూపించారు.ఈ కాన్సెప్ట్ మొదటి సినిమా లో కూడా వాడరు .ఈ కాన్సెప్ట్ ని ప్రేక్షకులు అందరు అర్థం చేసుకొని ఆదరించారు కాబట్టే సినిమా ఇంత గొప్ప విజయాన్ని సాధించింది .

Baby He Loves You Lyrics in Telugu – Arya-2 Video Song | Allu Arjun | Devi Sri Prasad | Kajal

ఇక ఈ సినిమా లో ఉన్న “బేబీ హి లవ్స్ యు ….” అంటూ సాగే పాట  అందర్నీ మెప్పించి అలరిస్తుంది.ముఖ్యం గా ఈ పాట లో అల్లు అర్జున్ డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అద్భుతం గ ఉంటాయి .పాట కూడా పెళ్లి బ్యాక్ డ్రాప్ లో సాగుతూ అందరికి మంచి దృశ్యాలతో కనువిందు చేస్తుంది .ఈ పాట లో తన స్నేహితుడు కాజల్ ని ఏ విధంగా ప్రేమిస్తాడో పాట ద్వారా వివరిస్తాడు .ఈ పాట మొదలయినప్పటి నుండి అయిపోయే వరకు అద్భుతమైన డాన్స్ తో పాటు గా సన్నివేహాసాలను మనకు చూపిస్తుంది ..ఈ పాట తో పాటుగా మిగతా 5 పాట లు కూడా అందరి మన్ననలను పొందాయి .

చక్కటి కథ,కథకి దగ్గ దర్శకత్వం ,సినిమా కి దగ్గట్టుగా సం సం గీతాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు ,అద్భుతంగా నటించిన నటి నటులు ,ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను రాబట్టడానికి ఇంతకు మించి ఇంకా ఎం కావలి .ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆర్య 2 అద్భుతమైన విజయాన్ని సాధించి వైవిధ్యమైన సినిమా గ నిలిచింది.

You May Like:

Baby he loves you lyrics in telugu

baby he loves you song download pagalworld

arya 2 mohajaalakam baby he loves you

baby he loves you song download pagalworld in hindi

baby he loves you malayalam mp3 song download

arya 2 songs

arya 2 mohajalakam baby he loves you

baby he loves you ringtone download

uppenantha lyrics

Leave a Comment