Praja Sadhikara Survey 2021 – ప్రజా సాధికార సర్వే పూర్తి వివరాలు

Why this Praja Sadhikara Survey  ప్రజా సాధికార సర్వే ఎందుకు 

ప్రభుత్వం ప్రవేశ పెట్టె సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటి కి చేరేలా పటిష్టమైన చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సాధికార సర్వే ను చేయాలని తలబెట్టింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో నివసిస్తున్న కుటుంబాలకు సంబంధించిన ఒక సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు. ప్రభుత్వ ఫలాలు ఎంత మందికి చేరుతున్నాయో అనే దాని మీద కూడా ఒక స్పష్టత లేదు. ఈ సర్వే  ద్వార రాష్ట్రం లో నివసించే ప్రతి కుటుంభానికి సంబంధిన సమాచారాన్ని సేకరించి నమోదు చేసుకోవడం ప్రధానమైన అంశం.  ఈ సర్వే లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రతి పౌరుడు, ప్రతి కుటుంభం తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

Praja Sadhikara Survey 2021

ఈ ప్రజా సాధికార సర్వే నిర్వహణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  prajasadhikarasurvey.ap.gov.in అనే వెబ్ సైట్ ను తెరిచింది. అలాగే వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ని  36000 టీములుగా  సిద్ధం చేసింది. దానిలో భాగంగా ఒక లక్ష ట్యాబ్ లను తమ సిబ్బంది కి పంపిణీ చేసింది. తద్వారా ప్రతి అధికారి రోజుకు 14 కుటుంబాల చొప్పున 500 కుటుంబాలకు సంబంధిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. 

Praja Sadhikara Survey Registration 2021

Documents Required For Praja Sadhikara Survey 2021 ఏమేమి పత్రాలను సమర్పించాలి 

ఈ సర్వే లో పాల్గొనే వారు తప్పనిసరిగా వారికి సంబంచిన పత్రాలైన

ఆధార్ కార్డు,బ్యాంక్ ఖాతా పుస్తకం,  ఓటర్ కార్డు,రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తి పన్ను పత్రాలు, వెహికల్ రిజిస్ట్రేషన్, గ్యాస్ బుక్, వికలాంగుల సర్టిఫికెట్, క్యాస్ట్ అండ్ ఇన్ కం సర్టిఫికెట్స్ , కిసాన్ కార్డు, పింఛన్ కార్డు మొదలగునవి చూపించవలసి ఉంటుంది.

Link Your Aadhar Number with Praja Sadhikara Survey

సర్వేకు మీ ఆధార్ లింక్ చేసుకునే విధానం

  1. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
  2. ఎంటర్ చేసి, సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది.
  3. OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, మీ వివరాలు సాధికార సర్వే కి లింక్ చేయబడతాయి.
  4. మీ వివరాలు మీ ఫోటో తో సహా మీరు verify చేసుకునే అవకాశం కలదు

ప్రజ సాధికార సర్వే చెక్ చేయడం గురించి అవసరమైన వెబ్సైట్ లింకులను తెలుపుతున్నాను. మీ కుటుంబ వివరాలను ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) 2016 లో ఆధార్ నంబర్ ఉపయోగించి / మీ స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి వివరాలు తెలుసుకోండి.

Smart pulse survey కి సంబంధించిన ఫీల్డ్ సర్వేయర్లు, బయోమెట్రిక్ కు అనుసంధానించబడిన టాబ్లెట్ ద్వారా సంబంధిత పోర్టల్‌ను యాక్సెస్ చేయడం ద్వారా డేటాను నమోదు చేయవచ్చు. దీని ద్వారా డేటా ధ్రువీకరణలు ఆన్‌లైన్‌లో సక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా తప్పులకు అవకాశం లేకుండా ఉంటుంది. మరియు ఫీల్డ్ సర్వే పూర్తయిన 2 వారాల్లో డేటా యొక్క unification మరియు analysis పూర్తవుతుంది.

AP Praja Sadhikara Survey Official website link :

 praja sadhikara survey ap gov in

AP స్మార్ట్ పల్స్ సర్వే కుటుంబ స్థితిని ఎలా పొందాలి?

ఇందుకోసం అధికారిక AP పల్స్ సర్వే వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. www.prajasadhikarasurvey.ap.gov.in

 తర్వాత చెక్ సర్వే స్టేటస్ option పై క్లిక్ చేయాలి.

 కుటుంబ సభ్యుడు, తన 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత , confirm టన్‌పై క్లిక్ చేయండి.

 చివరకు మీ కుటుంబ సభ్యుల పల్స్ సర్వే స్టేటస్ ని పొందుతారు.

ప్రజా సాధికర సర్వే – మీ ఆధార్ సంఖ్యను ప్రజా సాధికారా సర్వేతో లింక్ చేయండి : How to Get AP Smart Pulse Survey Family Status

  • Visit Official AP Pulse Survey Website : www.prajasadhikarasurvey.ap.gov.in
  • Next Click on Check Survey Status Tab
  • Then Enter Family Member 12 Digit Aadhaar Number
  • Then Click on Verify Button
  • Finally you get your Family Member Pulse Survey Status

ప్రజా సాధికార సర్వే లో ఎవరైతే తమ ఆధార్ నెంబర్ ను యాడ్ చేసుకోలేదో, అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Also Read:

Leave a Comment