Alluri Sitarama Raju Biography in Telugu – అల్లూరి సీతారామ రాజు

Bigg Boss 7 Telugu Vote

Alluri Sitarama Raju Biography in Telugu: అల్లూరి సీత రామ రాజు, ఈ  పేరు వింటేనే మనకు   మన్యం వీరుడి కథలు కళ్ళ ముందు కదలాడుతాయి. అంతటి గొప్ప స్వాతంత్య్ర సమారా యోధుడు మన తెలుగు బిడ్డ అల్లూరి సీత రామ రాజు. అల్లూరి సీత రామ రాజు జులై 4 న 1897 వ సంవత్సరం లో  విశాఖపట్నం జిల్లా లోని పాండ్రంగి గ్రామం లో జన్మించాడు.

కానీ మన మన్యం వీరుని బాల్యం మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా లోని మోగల్లు లో గడిచింది. వీరి తల్లి తండ్రుల పేర్లు వెంకట రామ రాజు మరియు సూర్య నారాయణమ్మ. మన్యం ప్రజల నుండి వచ్చిన గొప్ప పోరాట యోధుడు మన అల్లూరి సీత రామ రాజు.

మనం అల్లూరి సీత రామ రాజు ని అగ్గి పిడుగు అల్లూరి గ కూడా పిలుచుకుంటాం. అల్లూరి భారత దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు కాస్త పడ్డారు. 27 ఏళ్ల వయసు లో తన మన్యం ప్రజల హక్కుల కోసం మరియు భారత దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను వదిలిన గొప్ప పోరాట యోధుడు మన అల్లూరి సీత రామ రాజు.  చాల రోజులు మన అల్లూరి బ్రిటిషర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసాడు.

చివరికి అదే బ్రిటీషర్ల చేతుల్లో 1924 మే 7 న వీర మరణం పొందాడు. తన చివరి శ్వాస అరకు అల్లూరి సీత రామ రాజు దేశం కోసం మరియు తన వారైన మన్యం ప్రజల కోసం పాటు పడ్డాడు.

అల్లూరి సీత రామ రాజు 9 వ తరగతి వరకు చదివారు, చదివింది తక్కువే అయినా మన అల్లూరి సీత రామ రాజు గారు జోతిష్య శాస్త్రం, వీలు విద్య, గుర్రపు స్వారీ లాంటి వాటిలో ప్రావిణ్యం సంపాదించారు. అల్లూరి సీత రామ రాజు మొదటి సరిగా మన్యం లోకి 1971 లో అడుగు పెట్టారు అప్పుడు మన్యం లోకి విశాఖపట్నం లోని కృష్ణదేవి పేట ద్వారా ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడి అన్యాయం ప్రజల పరిస్థితి ని చూసి చాలించి పోయి వారి లో ధైర్యం నింపి మరియు వారి దీన స్థితి ని చూసి చాలించి పోయి విప్లవం కి నాంది పలికారు.

విప్లవాన్ని రాజేయడం లో భాగంగా మరియు ఆయుధాలను సమకూర్చుకోవడానికి అల్లూరి సీత రామ రాజు పలు దఫాలుగా బ్రిటిషు వాళ్ళ పోలీస్ స్టేషన్ ల పైన దాడులు జరిపారు. అందులో మొదటి సారి 1922 ఆగష్టు 22 న చింత పల్లి పోలీస్ స్టేషన్ పైన దడి చేసారు, దాడి తర్వాత అక్కడి నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకొని వాటి ద్వారా మన్యం ప్రజల్ని సాయుధు;ని చేసారు.

ఆ తర్వాత వరసగా 23న కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్ పైన మరియు 24 న తూర్పు గోదావరి జిల్లా లోని రాజవొమ్మంగి పోలీస్ స్టేష పైన దాడులు జరిపి అక్కడి ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.

అల్లూరి చర్యలతో విసిగిపోయిన బ్రిటిషు ప్రభుత్వం, విప్లవాన్ని అణిచి వేయడానికి ముమ్మర చర్యలు చేపట్టింది. ఆ చర్యల్లో భాగం గ చాల మంది రాజు అనుచరులని చంపింది మరియు ఆ రోజుల్లోనే రాజు పైన 10,000 రివార్డు ప్రకటించింది. దీన్ని బట్టి మనం అల్లూరి సీత రామ రాజు బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టాడో అర్హం చేస్కోవచ్చు.

అల్లూరి సీత రామ రాజు దొరకట్లేదు అనే అక్కసు తో బ్రిటిష్ వాళ్ళు మన్యం జనాల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఇది తెలుసుకున్న రాజు తన వారి కోసం 1924 మే 7న బ్రిటిష్ వారికి లొంగిపోయారు. బ్రిటిష్ వారు ఆ తర్వాత అల్లూరి ని చెట్టు కి కట్టేసి కాల్చి చంపారు.

Leave a Comment